Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadLife StylePoliticsSpot NewsTelangana

కొండరెడ్ల అభివృద్ధికి ప్రత్యేక కృషి

కొండరెడ్ల అభివృద్ధికి ప్రత్యేక కృషి

పూసుకుంటలో అభివృద్ధిపై మంత్రి తుమ్మల సమీక్ష

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జనవరి 11)

కొండరెడ్ల గ్రామాల్లోని గిరిజన మహిళలు, యువకులు బాధ్యతతో ముందుకు వస్తే అధికారులతో వారి పిల్లల విద్యాభివృద్ధి, జీవనోపాధికి కృషి చేస్తామని తెలంగాణ వ్యవసాయ, చేనేత, జౌళి, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం దమ్మపేట మండల పరిధిలోని మారుమూల పూసకుంటలో కొండరెడ్ల అభివృద్ధి, సంక్షేమంపై ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి, జిల్లా అధికారులు, గ్రామస్తులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసి గిరిజనులు, కొండరెడ్ల కుటుంబాలు ఇతరులతో పోటీ పడే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విషయం తెలిపారు. పూసుకుంట కొండ రెడ్ల గిరిజనులు కోరినట్లు ఈ గ్రామానికి రాచనగూడెం, పూసుకుంట మీదుగా ములకలపల్లి వెళ్లడానికి రూ.4.18 కోట్ల వ్యయంతో రహదారి కోసం 3 కల్వర్టుల నిర్మిస్తున్నామన్నారు. పూసుకుంట, కటుకూరు గ్రామాల్లో రైతుల వ్యవసాయ అవసరాలకు రూ.20.11లక్షలతో 3 బోర్ వెల్స్, 3 ఆయిల్ పామ్ ప్లాంటేషన్స్ ప్రారంభించామన్నారు. పుసుకుంటలోని 376 మంది గిరిజనులకు రూ.4లక్షలతో మహిళలు, పురుషులు, విద్యార్థులకు దుస్తులు అందించామన్నారు. 40ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని జిల్లాలోని మారు మూల గిరిజనుల కోసం ఉద్యోగులంతా మనసుపెట్టి, బాధ్యతగా పనిచేసి పేరు తెచ్చుకోవాలన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ, పివిటిజి గ్రామాలకు 40 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో పూసుకుంట గ్రామంలో కొండరెడ్లకు అందించడం సంతోషకరమన్నారు. గిరిజనయువతకు హైదరాబాదులో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ, మారుమూల ప్రాంత గిరిజన యువత, విద్య, వైద్యం, వ్యవసాయం పరంగా ముందుకు వచ్చి బాధ్యతగా చేసుకుంటే తప్పనిసరిగా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చన్నారు. ఏ రంగంలో మక్కువ ఉందో ఆ అంశాలు తమ దృష్టికి తీసుకొస్తే అభివృద్ధి దిశగా నడిపిస్తామన్నారు. పూసుకుంట గ్రామం లోని కమ్యూనిటీహాలులో జీవనోపాధికి పనికివచ్చే ఒక చిన్నతరహా యూనిట్ ప్రారంభించుకుంటే పదిమందికి ఉపాధి దొరుకుతుందన్నారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోకుండా ఈ సంవత్సరం ‘రివర్ ఫెస్టివల్’ ఏర్పాటు ద్వారా చేస్తున్న కృషిని మార్చి నెలాఖరు దాకా కొనసాగిస్తున్నామన్నారు. ఐటీడీఏ పీఓ బి. రాహుల్ మాట్లాడుతూ, పివిటిజి గ్రామాల అభివృద్ధికి గిరిజన సంక్షేమశాఖ ద్వారా గిరివికాసం కింద బోర్లు, కరెంటు, గిరిజనరైతులకు పామాయిల్ మొక్కలు, విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధతో వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ గ్రామంలోని రైతులకు ఐటీడీఏ ద్వారా మూడు మోటార్లు, పది రోజుల్లోనే కరెంటు సౌకర్యం కల్పించి 15 రోజుల్లో బోర్లు వేయించామన్నారు. ప్రతి రైతుకు తప్పనిసరిగా కరెంటు మోటార్లు, బోర్లు అందిస్తామని, హార్టికల్చర్ ద్వారా ఆయిల్ పామ్ సాగు, అంతర పంటగా మునగ సాగు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని హామీనిచ్చారు. కొండ రెడ్ల గ్రామాలైన 8హ్యాబిటేషన్లలో 300 మంది కుటుంబాలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు మాట్లాడుతూ, కొండ రెడ్ల జీవనోపాధి, అభివృద్ధికి తమవంతుగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డీఎఫ్ఓ కృష్ణగౌడ్, ఆర్.అండ్. బి ఈఈ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మధు, సీపీఓ సంజీవరావు, సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, తహసిల్దార్ వాణి, ఎంపీడీఓ రవిచంద్రారెడ్డి, ఆర్వోఎఫ్ఆర్ డీటీ లక్ష్మీనారాయణ, ఎఫ్.డి.ఓ ఉదయకుమార్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోలీసుశాఖలో పనిచేసేవారు దృఢంగా ఉండాలి : ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

మధిరలో 12న ముగ్గుల పోటీలు

Divitimedia

నూతన ఉస్మానియా ఆసుపత్రికి నెలాఖరులోగా శంకుస్థాపన

Divitimedia

Leave a Comment