Divitimedia
Bhadradri KothagudemEntertainmentLife StylePoliticsSpot NewsTelangana

బీసీ సంక్షేమ కళ్యాణమండపానికి శంకుస్థాపన

బీసీ సంక్షేమ కళ్యాణమండపానికి శంకుస్థాపన

✍️ మణుగూరు – దివిటీ (జనవరి 11)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గుట్టమల్లారంలో బీసీ సంక్షేమ సంఘం కళ్యాణమండపం నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మున్నూరు కాపుసంఘం నూతన సంవత్సర క్యాలెండర్ కూడా ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కాపు సంఘం నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ, శుభదినాల్లో కమ్యూనిటీ హాలు శంకుస్థాపన చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నిరుద్యోగులు టాలెంట్ చూపించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలలో ప్రతిభ చూపించాలని కోరారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మఇళ్లు అందజేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక తహసిల్దారు రాఘవరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ డీఈ సత్యనారాయణ, ఏఈ రామారావు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మణుగూరు మండల మున్నూరు కాపుసంఘం అధ్యక్షుడు ఓనం కృష్ణమోహన్, సెక్రెటరీ గాండ్ల సురేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినకి నవీన్, మున్నూరు కాపుసంఘం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : పొంగులేటి

Divitimedia

ఐఎన్టీయూసీ మిత్రపక్షాల కేలండర్ ఆవిష్కరించిన ఐటీసీ ఉన్నతాధికారులు

Divitimedia

ఐసీడీఎస్ లో అక్రమార్కులదే ఇష్టారాజ్యం

Divitimedia

Leave a Comment