Divitimedia
Andhra PradeshBusinessCrime NewsLife StyleNational NewsPoliticsSpot News

ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై ‘సిట్’ ఏర్పాటు

ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై ‘సిట్’ ఏర్పాటు

✍️ అమరావతి – దివిటీ (డిసెంబరు 15)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమరవాణా నిరోధం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ రాష్ట్ర డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాకినాడ పర్యటనలో రేషన్ బియ్యం అక్రమాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తుబృందం (సిట్) ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర సీఐడీ విభాగం ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను ఆ సిట్ అధిపతిగా నియమించింది. ఆయనతో పాటుగా ఆ సిట్ బృందంలో సీఐడీ ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌, మరో నలుగురు డీఎస్పీలు ఉంటారు. రేషన్ బియ్యంలో అక్రమాలు నిరోధించేందుకు తీసుకున్న ప్రత్యేక చర్యలను కూడా ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో పేర్కొంది. రేషన్ బియ్యం అక్రమరవాణా చేస్తూ దొరికినవాహనాలు సీజ్ చేస్తారు. ఆ వాహనాల డ్రైవర్లకు 5 సంవత్సరాల జైలుశిక్షతో పాటు, రూ.10 వేల జరిమానా కూడా విధించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రేషన్ బియ్యంతో అక్రమంగా వ్యాపారం చేసేవారికి మాత్రం 10 సంవత్సరాల జైలుశిక్షతోపాటు రూ. 1లక్ష జరిమానా విధించేలా ప్రభుత్వం నిబంధనలు అమలు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts

‘మినిమమ్ వేజెస్ బోర్డ్’ మెంబర్ గా యారం పిచ్చిరెడ్డి

Divitimedia

కేంద్ర మంత్రులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

Divitimedia

మహిళల భద్రతే ప్రధానలక్ష్యం : ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

Leave a Comment