ఐకేపీ వరికోతయంత్రం లీజుకు అవకాశం
6వ తేదీన బూర్గంపాడులో లీజు ప్రక్రియ
✍️ బూర్గంపాడు – దివిటీ (నవంబరు 5)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ఐకేపీ మండల మహిళా సమాఖ్య దగ్గరున్న వరికోతయంత్రం రైతులకు లీజుకు ఇవ్వనున్నట్లు సమాఖ్య అధ్యక్షురాలు వి.మమత, ఏపీఎం మడిపల్లి నాగార్జున ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మండల మహిళా సమాఖ్యకు మంజూరైన ఈ వరికోతయంత్రం లీజుకిచ్చే ప్రక్రియ 6వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో వరికోతయంత్రం లీజుకు తీసుకునే ఆసక్తి గల రైతులు 6వ తేదీన ఉదయం 11 గంటలకు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని వారు కోరారు. ఈ సమావేశంలో లీజ్ కు ఇవ్వడానికి అవసరమైన విధి విధానాలు, షరతులు, అద్దె, అడ్వాన్స్ వివరాలు, అగ్రిమెంట్, తదితర అంశాలపై ఆ సమావేశంలో కూలంకషంగా చర్చించనున్నట్లు వెల్లడించారు. 6వ తేదీన జరిగే సమావేశానికి హాజరైన రైతులలో అధిక ధర (అద్దె) చెల్లించేందుకు ముందుకొచ్చిన రైతుకు ఆ యంత్రం లీజ్ కు ఇవ్వనున్నట్లు వివరించారు. అద్దె షరతులు, నియమ నిబంధనల విషయంలో మహిళా సమాఖ్యదే తుది నిర్ణయమని వారు స్పష్టం చేశారు. వరికోత యంత్రం ను..లీజ్ కు తీసుకోవడానికి ఆసక్తి ఉన్న మండలంలోని రైతులు కమీషన్ ఎజెంట్లు 6న జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు.
లోకేష్ పాదయాత్రకు బ్రాహ్మిణి శుభాకాంక్షలు…