Divitimedia
Andhra PradeshBusinessHealthHyderabadKhammamLife Style

అపరిష్కృత అంశాలపై రెండు ఉన్నతస్థాయి కమిటీలు

అపరిష్కృత అంశాలపై రెండు ఉన్నతస్థాయి కమిటీలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో నిర్ణయం

✍️ హైదరాబాదు – దివిటీ (జులై 6)

రాష్ట్రవిభజన తర్వాత తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలం అపరిష్కృతంగా ఉన్న అంశాలను పరిష్కరించుకునేందుకు ఉన్నతస్థాయిలో కమిటీలను ఏర్పాటుచేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం హైదరాబాదులోని ప్రజాభవన్‌లో రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ‌ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్‌, సత్యప్రసాద్‌, బీసీ జనార్ధన్‌రెడ్డి, రెండురాష్ట్రాల సీనియర్ అధికారులు కూడా సీఎంల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకు కాళోజీ నారాయణరావు రాసిన “నాగొడవ” పుస్తకం బహుకరించారు. అత్యంత సుహృద్భావ వాతావరణంలో జరిగిన సమావేశంలో
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అపరిష్కృతంగా ఉన్న అంశాలు పరిష్కరించుకోవడానికి ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల స్థాయిలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. పైస్థాయిలో నిర్ణయాలు తీసుకోవలసిన అంశాలను పరిశీలించేలా రెండు రాష్ట్రాల మంత్రులస్థాయిలో మరో కమిటీ కూడా ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఆ
మంత్రులస్థాయి కమిటీలో అంగీకారానికి రాలేని ఏవైనా అంశాలంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పెషల్ డ్రైవ్’ విషయంలో తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు ఇరు రాష్ట్రాల నుంచి అదనపు డీజీ స్థాయి అధికారులతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సందర్భంగా అంగీకరించింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

Divitimedia

ఇంతేనా సంక్షేమం… మరీ ఇదేం నిర్లక్ష్యం…?

Divitimedia

‘ఏఐ’తో బోధన విద్యార్థుల పాలిట వరం

Divitimedia

Leave a Comment