Divitimedia
Bhadradri KothagudemCrime NewsEducationHealthHyderabadLife StyleSpecial ArticlesTelanganaWomen

ఇంతేనా సంక్షేమం… మరీ ఇదేం నిర్లక్ష్యం…?

ఇంతేనా సంక్షేమం… మరీ ఇదేం నిర్లక్ష్యం…?

పోక్సో కేసులో ‘ఐసీడీఎస్’ అధికారుల నిర్లక్ష్యం

బాధితులకు మానసిక బలం అందించేదెవరో…

✍️ బూర్గంపాడు – దివిటీ (జూన్ 28)

ఓ పశువు చూపించిన నరకం ఆ పసిహృదయాన్ని గాయపరిస్తే, ఆదుకుని అక్కున చేర్చుకుని సాంత్వన కలిగించాల్సిన అధికారుల నిర్లక్ష్య ధోరణి బాధితులను మరింత బాధిస్తోంది. ఆ లేత పసిమొగ్గ హృదయాన్ని కోతపెడుతున్న ఆ పెనుగాయాన్ని మాసిపోయేలా తమ వంతు అండదండగా ఉండాల్సిన అధికారులు చూపిన అలక్ష్యం, ఆ బాధితుల ఆవేదనను మరింత పెంచింది. తమకు దక్కెవరంటూ ఆవేదన చెందుతున్న బాధితుల వేదన తగ్గించాల్సిన బాధ్యతగల అధికారులే తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఇటీవల వెలుగుచూసిన ‘చిన్నారిపై అఘాయిత్యం’ సంఘటనలో సంక్షేమశాఖ (ఐసీడీఎస్) అధికారులు, సిబ్బంది వ్యవహరించిన తీరు విమర్శలపాలవుతోంది. అభంశుభం తెలియని పసిపాపకు జరిగిన ఘోరంపై తక్షణం స్పందించాల్సిన ఐసీడీఎస్ అధికారులు గానీ, బాధ్యులైన ఉద్యోగులు గానీ రెండురోజుల వరకు ఏమీ పట్టనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. బాధిత చిన్నారిని వెంటనే అక్కున చేర్చుకుని ప్రథమ చికిత్స దగ్గర నుంచి పూర్తిగా కోలుకునే వరకు తగిన సాయం అందించాల్సిన బాధ్యత సంక్షేమాధికారులపై ఉంటుంది. తనకు ఏం జరిగిందో కూడా తెలియనంత అమాయకత్వంతో, జరగరానిదేదో జరిగిందనే తనకు జరిగిందనే తీవ్రమైన మానసిక సంఘర్షణతో విలవిల లాడిపోయే పరిస్థితిలో ఆ చిన్నారి బాధ చెప్పలేనిది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తమ పసిమొగ్గపై ఓ పశువు నిర్దయగా వ్యవహరించాడనే వేదన బాధిత కుటుంబ సభ్యులది. ఇంతటి దయనీయమైనస్థితిలో బాధితులకు అండగా నిలబడి ఆదుకోవాల్సిన బాధ్యత సంక్షేమాధికారులపైనే ఉంటుంది. సారపాకలో బాధిత చిన్నారి పట్ల అధికారులు ప్రదర్శించిన నిర్లక్ష్యధోరణిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సంఘటన జరిగిన రోజున, బాధితులకు తమవంతు అందించాల్సిన సాంత్వన గురించి పట్టించుకున్నవారే లేరు. సీడీపీఓ హైదరాబాదులో ఉండగా, కిందిస్థాయి సిబ్బంది కూడా బాధితుల దగ్గరకు వెళ్లనేలేదు. రెండవ రోజు తర్వాత మాత్రం పోలీసులు విచారణ ప్రక్రియలో భాగంగా అడిగితే ఆ ప్రక్రియకు మాత్రం సహకరించారు. ఆ తర్వాత అంటే సంఘటన వెలుగుచూసిన రెండు రోజులకు ఐసీడీఎస్ అధికారులు పరామర్శించినట్లు తెలుస్తోంది. అంతకుమించి ఆ బాధిత చిన్నారికి గానీ, ఆ కుటుంబ సభ్యులకు గానీ ధైర్యం చెప్పి సాంత్వన కలిగించే ప్రయత్నమేదీ జరగలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. మొత్తంమీద చూస్తే సారపాకలో చిన్నారిపై జరిగిన అఘాయిత్యం విషయంలో సంక్షేమాధికారులు, సిబ్బంది వ్యవహరించిన తీరుపట్ల సామాజికవేత్తలు, బాలల హక్కుల పరిరక్షణ ఉద్యమకారులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

***********
ఆరోజు అందుబాటులో లేను… ఆ తర్వాత బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించాం : ఐసీడీఎస్ బూర్గంపాడు సీడీపీఓ ప్రమీల

***********
“”సారపాకలో చిన్నారిపై అఘాయిత్యం జరిగిందనే సమాచారం అందిన రోజు నేను హైదరాబాదులో ఉన్నా. ఆ తర్వాత వచ్చి ఆ చిన్నారిని, ఆమె కుటుంబ సభ్యులను కలిసి వివరాలు తీసుకున్నాం. సిబ్బందికి ట్రైనింగ్ నిర్వహిస్తున్న బిజీ కూడా ఉంది. బాధిత బాలికకు మా పరిధిలో అన్నివిధాలా సాయం చేస్తాం.”

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జిల్లాలో 3న మంత్రి పొంగులేటి పర్యటన

Divitimedia

ఎన్.హెచ్.ఎం బకాయిలు విడుదల చేయాలని కోరిన సీఎం రేవంత్

Divitimedia

తెలంగాణ మహిళల చైతన్యం, వీరత్వానికి ప్రతీక చాకలి ఐలమ్మ పోరాటం

Divitimedia

Leave a Comment