నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం
✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం (మే 17)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 18వ తేదీ (శనివారం) ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈఓ ప్రసూనరాణి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగూడెంలో జిల్లా ప్రజాపరిషత్ సమావేశమందిరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (జడ్పీటీసీ) సభ్యులు, జిల్లా పరిషత్ కో -ఆప్టెడ్ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, శాశ్వత ఆహ్వానితులు, సంబందిత జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.