సీఎం పర్యటన సందర్భంగా కొత్తగూడెంలో ట్రాఫిక్ మల్లింపులు
ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు
✍️ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం (మే 3)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరుగనున్న బహిరంగసభా ప్రాంగణం వద్ద భద్రతా ఏర్పాట్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం పరిశీలించారు. హెలిపాడ్, పార్కింగ్ స్థలాలను పరిశీలించి, పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ గురించి పోలీసు అధికారులకు సూచనలను చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) సాయి మనోహర్, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ట్రైనీ ఐపీఎస్ అధికారి విక్రాంత్ సింగ్, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు విధించిన ట్రాఫిక్ మార్పులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో బహిరంగసభ నేపథ్యంలో శనివారం సమయానుసారం పట్టణంలో ట్రాఫిక్ డైవర్షన్ చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
- పాల్వంచ వైపు నుంచి కొత్తగూడెం మీదుగా విజయవాడ వైపు వెళ్లే వాహనాలు ఓల్డ్ డిపో రోడ్డు నుంచి భజన మందిర్ రోడ్డు మీదుగా సింగరేణి హెడ్ ఆఫీస్ నుంచి రామవరం వైపుగా మళ్ళింపు.
- భద్రాచలం, పాల్వంచ వైపు నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు ఇల్లందు క్రాస్ రోడ్డు నుంచి టేకులపల్లి, ఇల్లందు మీదుగా ఖమ్మం వైపు మళ్ళింపు.
- ఖమ్మం నుంచి కొత్తగూడెం మీదుగా పాల్వంచ వైపు వెళ్లే వాహనాలు విద్యానగర్ బైపాస్ రోడ్డు నుంచి సింగరేణి హెడ్ ఆఫీస్, మెయిన్ హాస్పిటల్,భజన మందిర్ రోడ్డు, ఓల్డ్ డిపో రోడ్డు నుంచి మొర్రేడువాగు బ్రిడ్జ్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్డు నుంచి పాల్వంచ వైపు మళ్ళింపు
- విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలు సింగరేణి హెడ్ ఆఫీస్, భజనమందిర్ రోడ్డు మీదుగా ఓల్డ్ డిపో రోడ్డు నుంచి మొర్రేడు వాగు బ్రిడ్జ్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్డునకు మళ్లించడం జరుగుతుంది.
- సామాన్య ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా కొత్తగూడెం పట్టణ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న ట్రాఫిక్ డైవర్షన్ ను ప్రలందరూ గమనించి పోలీసు వారికి సహకరించాలని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ కోరారు.