ఐడీఓసీలో వివేకానందుడికి నివాళులర్పించిన అధికారులు
✍🏽 దివిటీ – కొత్తగూడెం (జనవరి 12)
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు, పలు శాఖల అధికారులు వివేకానందుడి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత, స్వామి వివేకానందుని స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ఒక్కరు వారిలోని శక్తి, సామర్ధ్యాలు సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని, సమాజానికి, దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి పరంధామ రెడ్డి, ఇంటర్మీడియట్ అధికారి సులోచనరాణి, డీపీఆర్ఓ శ్రీనివాసరావు, డీసీఓ, వివిధ క్రీడాసంఘాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.