Divitimedia
బూర్గంపాడులో కాంగ్రెస్ ప్రచారం
Bhadradri KothagudemPoliticsTelangana

బూర్గంపాడులో గడపగడపకు కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభం

బూర్గంపాడులో గడపగడపకు కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభం

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండల పరిధిలో ‘గడపగడపకు కాంగ్రెస్ పాదయాత్ర’ను బుధవారం ప్రారంభించారు. మండలకేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి రామాలయం వరకు ర్యాలీ నిర్వహించిన ఆ పార్టీ కార్యకర్తలు ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ప్రారంభించి, తమ మేనిఫెస్టో అంశాల గురించి విస్తృతప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరుగ్యారెంటీలలో ముఖ్యంగా మహిళలకు ప్రతినెల రూ.2500ఖాతాలో జమచేస్తామని చేయబడుతుందనీ, మహిళలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందించడంతోపాటు మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణసౌకర్యం కల్పిస్తామని తెలిపారు. రైతుభరోసా పేరుమీద రైతులకు ఏడాదికి రూ.15,000, కౌలు రైతులకు రూ. 12,000 సాయం, 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు, ఇండ్లులేనివారికి ఇందిరమ్మ ఇళ్లకు ప్రతి కుటుంబానికి రూ.5లక్షల సాయం అందజేయనున్నట్లు వివరించారు. విద్యా భరోసాకార్డుపై విద్యార్థులకు రూ.5లక్షలు అందజేస్తారని ప్రజలకు తెలియపరుస్తూ కాంగ్రెస్ ను గెలిపించేందుకు ‘హస్తం(చెయ్యి) గుర్తుకే ఓటువేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారం వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి చల్లా వెంకటనారాయణ, సీనియర్ నాయకుడు కణితి కృష్ణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, పార్టీ టౌన్ అధ్యక్షుడు మందా నాగరాజు, నాయకులు కైపు శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ పుట్టి కుమారి, బాదం రమేష్ రెడ్డి, నాయకులు గోనె రేణుక, భూక్యా సుగుణ, కర్రి కామేశ్వరి, పొలగొండ ప్రభాకర్, లక్ష్మణ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జిల్లాలో అధ్వానంగా నేషనల్ హైవే నిర్వహణ

Divitimedia

పాఠశాలను తనిఖీ చేసిన కేంద్రప్రభుత్వ ప్రతినిధి

Divitimedia

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీకి సీఆర్పీఎఫ్ అభినందనలు

Divitimedia

Leave a Comment