Divitimedia
Bhadradri KothagudemBusinessLife StyleTelangana

వేడుకగా ఐటీసీ రోటరీక్లబ్ ఆఫ్ ఇన్‌భద్రా ఇన్‌స్టాలేషన్

వేడుకగా ఐటీసీ రోటరీక్లబ్ ఆఫ్ ఇన్‌భద్రా ఇన్‌స్టాలేషన్

✍🏽 దివిటీ మీడియా – సారపాక

సారపాకలోని ఐటీసీ రోటరీక్లబ్ ఆఫ్ ఇన్‌భద్రా ప్రమాణస్వీకారోత్సవం శుక్రవారం రాత్రి వేడుకగా జరిగింది. స్థానిక కళాభారతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి రోటరీ డిస్ట్రిక్ట్- 3150 గవర్నర్ డా.బి.శంకర రెడ్డి, పూర్వగవర్నర్లు జె అబ్రహం, అసిస్టెంట్ గవర్నర్ సత్యనారాయణ హాజరయ్యారు. రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా కొత్త అధ్యక్షుడిగా జయంత్ కుమార్ దాస్, సెక్రటరీగా కేవీఎస్ గోవిందరావు(2023-24) ఎంపికకాగా, వారి చేత శంకరరెడ్డి ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జయంత్ కుమార్ దాస్ మాట్లాడుతూ, 2022-23లో అధ్యక్షుడు టి.ఎస్ భాస్కరరావు, సెక్రెటరీ డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఐటీసీ రోటరీక్లబ్‌ సమాజానికి మంచి సేవలందించి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇకపైన కూడా ఉత్తమ సేవలు కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగానే చుట్టుపక్కల గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవలి 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించిన 24మంది బాలికలకు రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా స్కాలర్‌షిప్పులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సారపాక ఐటీసీ యూనిట్ హెడ్ సిద్ధార్థ మొహంతి, జీఎం (హెచ్ ఆర్) శ్యాంకిరణ్, చెంగల్రావు, రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా మాజీ అధ్యక్షులు హరినారాయణన్, కార్యదర్శి కె రాంబాబు, సభ్యులు మరడన శ్రీనివాస్, సౌరబ్ ముఖర్జీ, చాంద్ బాషా, శ్రీను, ప్రతాప్, నాగ మల్లేశ్వరరావు, యేగి చంద్రశేఖర్, పి దుర్గా ప్రసాద్, పి సత్యనారాయణ, తదితరులు హాజరయ్యారు. వీరితోపాటు రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఇన్ భద్రా నూతన అధ్యక్షుడిగా ఎన్ మురళి, కార్యదర్శిగా గాయత్రీదేవి ప్రమాణ స్వీకారం చేశారు.

Related posts

సంక్షేమ పథకాలకు ప్రత్యేకాధికారుల నియామకం

Divitimedia

శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో “రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్”

Divitimedia

లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు

Divitimedia

Leave a Comment