Divitimedia
BusinessFarmingKhammamLife StylePoliticsSpot NewsTelanganaWELFAREWomen

మహిళా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఎన్నిక

మహిళా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఎన్నిక

✍️ దివిటీ మీడియా (మధిర)

ఖమ్మం జిల్లా మధిరలో మహిళా మత్స్య పారిశ్రామిక సహకారసంఘాల ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సంఘం అధ్యక్షురాలిగా గద్దల శారమ్మ, ఉపాధ్యక్షురాలుగా గద్దల ఝాన్సీలక్ష్మి, కార్యదర్శి రెడిపంగి మరియమ్మలను ఎన్నుకున్నారు. మడుపల్లిలోని మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షురాలుగా మేడికొండ అన్నమ్మ, ఉపాధ్యకురాలుగా జక్కి తేరేజమ్మ, కార్యదర్శిగా చింతల పద్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
మధిరలోని పీఏసీఎస్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో ఒక్కొక్క సంఘానికి 9 మంది డైరెక్టర్లచొప్పున కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన మహిళా సంఘాల సభ్యులను మధిర మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం అధ్యక్షుడు పులిపాటి సుబ్బారావు, కార్యదర్శి పిల్లి మూవీజ్ కమిటీ సభ్యులు అభినందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్

Divitimedia

రెండు కార్లలో తరలిస్తున్న రూ.19.5 లక్షల విలువైన 78 కిలోల గంజాయి పట్టివేత

Divitimedia

కలెక్టరేట్ లో మళ్లీ మళ్లీ అదే నిర్లక్ష్యమా…?

Divitimedia

Leave a Comment