Divitimedia
BusinessCrime NewsHyderabadLife StyleWELFARE

ఏసీబీకి పట్టుబడిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్

ఏసీబీకి పట్టుబడిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్

వెంటాడి రోడ్డుపై పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ రమేష్

✍️ దివిటీ – మధిర (నవంబరు 24)

మరణించిన ఓ భవన నిర్మాణ కార్మికుడి కుటుంబ సభ్యులకు బీమా ప్రయోజనం అందించేందుకు లంచం తీసుకుంటున్న ఖమ్మం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కర్నె చందర్ సోమవారం మధిరలో ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ వలపన్ని నిందితుడిని రోడ్డుపై వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం…  మరణించిన భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బు  రూ.1.30లక్షల బిల్లు పాస్ చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ రూ 15 వేల లంచం  డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ మాట్లాడుతూ, ఏ ప్రభుత్వ సేవకుడైనా లంచం అడిగినట్లయితే ప్రజలు ఏసీబీ  (తెలంగాణ అవినీతినిరోధకశాఖ) వారి టోల్ ఫ్రీ నెంబర్ – 1064 కు డయల్ చేయాలని కోరారు. దీంతోపాటు వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ – 9440446106,  ఫేస్ బుక్ – Telangana ACB, ఎక్స్- @TelanganaACB, వెబ్ సైట్ –  acb.telangana.gov.in  ద్వారా కూడా తెలంగాణ ఏసీబీని సంప్రదించవచ్చని వివరించారు. ఫిర్యాదుదారుల,  బాధితుల వివరాలు గోప్యంగా          ఉంచబడతాయని పేర్కొన్నారు.

Related posts

ఆశ్రమ విద్యాలయం తనిఖీ చేసిన ఎస్పీ

Divitimedia

వరంగల్ నేషనల్ హైవేస్ పీడీని అరెస్టు చేసిన సీబీఐ

Divitimedia

వరుసగా బయటపడుతున్న ఐకేపీ అక్రమాలు…

Divitimedia

Leave a Comment