Divitimedia
Bhadradri KothagudemLife StyleSpot NewsTelanganaWELFAREWomen

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ఇందిరమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్యే పాయం

✍️ దివిటీ – బూర్గంపాడు, (నవంబరు 23)

మహిళల సంక్షేమం కోసం పెద్దపీట వేసి, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఆదివారం నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంసహాయక (డ్వాక్రా) సంఘాల మహిళలనుద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే పాయం మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, మహిళాభివృద్ధికి అధిక ప్రాధాన్యతతో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళల పేరుమీద ఇందిరమ్మ పక్కా గృహం నిర్మాణానికి రూ.5లక్షలు అందిస్తున్నామన్నారు. నియోజకవర్గం పరిధిలో 3,500ఇందిరమ్మ ఇళ్లకుతోడు అదనంగా మరో 1000 ఇళ్లు మంజూరు చేయించామన్నారు. ఒక్క బూర్గంపాడు మండలంలోనే 689 ఇళ్లు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు లాభం పొందుతున్నారన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా మండలంలో 11,204 కుటుంబాలకు 200యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు ఆర్థికంగా బలం చేకూర్చే కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలంలో 1285 డ్వాక్రా సంఘాలకు చెందిన 9840 మందికి చీరల పంపిణీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీఎం, మండల మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ సందర్భంగానే 32 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి కింద ఆర్థికసాయం పంపిణీ చేశారు. ఐకేపీ ఏపీఎం హేమంతిని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, తహసీల్దార్ ప్రసాద్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పి.రాజేశ్వరి, కార్యదర్శి జి.వరమ్మ, కోశాధికారి బి.పద్మ, సీసీ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. పినపాక నియోజ‌క‌వ‌ర్గంలోని పినపాక, కరకగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు
మండలాల్లో ఆదివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించారు. కార్యక్రమాల్లో సంబంధిత మండలాల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పోలీసులకు పట్టుబడిన వాహనాలకు 27న వేలం

Divitimedia

మహిళను కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

Divitimedia

నకిలీ విత్తనాలు అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేక నిఘా

Divitimedia

Leave a Comment