Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StylePoliticsSpot NewsTelangana

సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్

సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్

వివరాలు వెల్లడించిన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్

✍️ దివిటీ – కొత్తగూడెం (సెప్టెంబర్ 1)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో ఈ నెల(సెప్టెంబర్) 3వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రం కొత్తగూడెంలో చేయనున్న ‘ట్రాఫిక్ డైవర్షన్’ వివరాలు డీఎస్పీ రెహమాన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం పర్యటన సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసువారు వాహనాల రాకపోకల నియంత్రణ కోసం చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు తలెత్తకుండా, ట్రాఫిక్ లో చిక్కుకోకుండా పోలీసు వారు చేపట్టే ‘ట్రాఫిక్ డైవర్షన్’ వివరాలను గమనించి ప్రజలు సహకరించాలని డీఎస్పీ ఈ సందర్బంగా కోరారు. ఈ ట్రాఫిక్ డైవర్షన్ 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపారు.

👉 వి.ఎం.బంజర నుంచి చంద్రుగొండ మీదుగా కొత్తగూడెం వైపు వచ్చే వాహనాలు కల్లూరు, తల్లాడ, ఏన్కూరు, జూలూరుపాడు మీదుగా కొత్తగూడెం చేరుకోవాలి.

👉 కొత్తగూడెం నుంచి వి.ఎం.బంజర వైపు ప్రయాణించే వాహనదారులు జూలూరుపాడు, ఏన్కూరు, తల్లాడ, కల్లూరు మీదుగా ప్రయాణించాలి.

Related posts

పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

Divitimedia

నిబంధనలతో మాకు పనేంటి…?

Divitimedia

సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ పర్యటన

Divitimedia

Leave a Comment