Divitimedia
Bhadradri KothagudemBusinessFarmingLife StyleSpot NewsTechnologyTelanganaWomen

‘మోడల్ డెమోఫామ్’ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

‘మోడల్ డెమోఫామ్’ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

✍️ దివిటీ (బూర్గంపాడు) ఆగస్టు 28

జిల్లాలో ప్రజలకు అదనపు ఆదాయం, ఉపాధి అవకాశాలు పెంచేలా ‘మోడల్ డెమో ఫామ్’ రూపొందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర గ్రామపంచాయతీ పరిధిలోని జింకలగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పక్కనున్న నీటిపారుదల శాఖ భూమిలో ‘మోడల్ డెమో ఫామ్’ ఏర్పాటు కోసం స్థలం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డెమో ఫామ్ ఏర్పాటు గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కూరగాయలసాగు, మట్టితో ఇటుకల తయారీ యూనిట్, వెదురు, వాక్కాయ కంచె, క్వాయిల్ యూనిట్, సోలార్ డ్రైయర్ ఏర్పాటు చేయడంతోపాటు మునగ చెట్లు పెంచే విధంగా ప్రణాళికలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ డెమో ఫామ్ ద్వారా రైతులకు మాత్రమే కాక మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కలగడం, సరికొత్త వ్యవసాయ పద్ధతులు పరిచయం కావడం ద్వారా అదనపు ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ బి.ఎన్ ప్రసాద్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నాగార్జున, ఆర్ఐ నరసింహారావు, సీతారామ ప్రాజెక్ట్ ఏఈ సందీప్, ఎంపీఓ బాలయ్య, ఏపీఓ విజయలక్ష్మి, ఏపీఎం హేమంతిని, పంచాయతీసెక్రెటరీ భవాని తదితరులు పాల్గొన్నారు.

Related posts

సంక్రాంతికి ఊరెళ్తున్నారా… అయితే జరభద్రం…!

Divitimedia

Divitimedia

నిజమైన జర్నలిస్టు తప్పుడు వార్తలు రాస్తడా?

Divitimedia

Leave a Comment