Divitimedia
Bhadradri KothagudemCrime NewsEntertainmentLife StyleSpot NewsTelanganaTravel And TourismYouth

గణేష్ మండపాల్లో నియమనిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

గణేష్ మండపాల్లో నియమనిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

మండపాల ఏర్పాటు కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 18)

జిల్లాలో గణేష్ మండపాల నిర్వహణకు ఉత్సవ కమిటీ సభ్యులు తెలంగాణ పోలీసుశాఖ రూపొందించిన పోర్టల్ లింక్ :  https://policeportal.tspolice.gov.in లో ధరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఈ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ కేవలం మండపాల నిర్వహణ, మండపానికి సంబంధించిన సమాచారం కోసం  మాత్రమేనని ఆయన వివరించారు. ఈ సమాచారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత,  పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులభంగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. పోలీసు శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని, ఆ తర్వాతే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీలు పాటించవలసిన నియమ నిబంధనలను ఎస్పీ వివరించారు…

👉 గణేష్ మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వహకులదే.

👉 ప్రతీ మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

👉 నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలి.

👉 గణేష్ మండపాలు ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలకు, ట్రాఫిక్ నకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.

👉 మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం యజమాని, సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి.

👉 మండపాల కమిటీ వివరాలు, బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలి.

👉 సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి.

👉 మండపాల్లో, శోభాయాత్ర సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలను ఏర్పాటు చేయరాదు.

👉 మండపం వద్ద 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.

👉 భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు ఏర్పాటు చేయడంతోపాటు వాలంటీర్లను నియమించుకోవాలి.

👉 అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దగ్గరలో ఇసుక, నీటిని అందుబాటులో ఉంచుకోవాలి.

👉 గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం,  అసభ్యకరమైన నృత్యాలు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు, పాటలు పూర్తిగా నిషేధం.

👉 మండపం వద్ద పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి. విధిగా పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో రాసి సంతకం చేస్తారు.

👉 అనుమానాస్పదమైన బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు, వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే డయల్ 100 గానీ స్థానిక పోలీసులకు గానీ  సమాచారం ఇవ్వాలి.

👉 సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి వదంతులను నమ్మకూడదని, ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉన్నా  వెంటనే సంబంధిత పోలీసు అధికారులను గానీ Dial 100 నంబర్‌ను గానీ సంప్రదించాలని ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ సూచించారు.


                 ===≈======
గణేష్ ఉత్సవ కమిటీల సభ్యులతో సీఐ సమావేశం
                 ===≈======

బూర్గంపాడు పోలీసుస్టేషన్ లో సోమవారం పాల్వంచ ఇన్ఛార్జ్ సీఐ  (అశ్వారావుపేట) నాగరాజు మండల గణేష్ మండపాల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. రాబోయే  గణపతి నవరాత్రుల సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తగు సూచనలు చెప్పారు. ఈ కార్యక్రమంలో  బూర్గంపాడు ఎస్.హెచ్.ఒ ఎస్సై మేడ ప్రసాద్, ఎస్సై దేవ్ సింగ్ పాల్గొన్నారు.

Related posts

బెయిల్ షరతుల నుంచి అల్లు అర్జున్‌కు ఊరట

Divitimedia

కలెక్టరేట్ లో మళ్లీ మళ్లీ అదే నిర్లక్ష్యమా…?

Divitimedia

జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

Divitimedia

Leave a Comment