భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు




ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రుల బృందం
✍️ దివిటీ మీడియా (అమరావతి)
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను శనివారం నారా లోకేష్, వంగలపూడి అనితలతో కూడిన మంత్రుల బృందం అధికారులతో కలిసి పరిశీలించింది. ఈ సందర్భంగా ఆ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల (ఆగస్టు) 1వతేదీన ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. భోగాపురం వస్తున్న దేశ ప్రధానికి ఘనంగా ఆహ్వానం పలుకుతూ, 13 వేలమందితో దేశంలోనే అతిపెద్ద ధింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం, సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సభను విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఈ సమీక్ష సమావేశంలో. మంత్రులు సూచించారు.
BhogapuramAirport #AlluriSitaramaRajuInternationalAirport #NaraLokesh #PMModi #August1 #AndhraPradesh
Save or share this story as a newspaper-style Epaper Clip:

