Divitimedia
Bhadradri KothagudemCrime NewsHealthLife StyleSpot NewsTechnologyTelangana

పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షల శిబిరం

పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షల శిబిరం

✍️ పాల్వంచ – దివిటీ (ఏప్రిల్ 10)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ సూచనలతో పాల్వంచ పోలీసుస్టేషన్ ప్రాంగణంలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది వారి కుటుంబసభ్యులకు గురువారం ఉచిత కంటిపరీక్షల శిబిరం నిర్వహించారు. శరత్ మాక్సివిజన్ కంటి ఆసుపత్రి సహకారంతో పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి మనిషికి శరీరంలోని అన్ని అవయవాలలో కళ్లు చాలా ప్రధాన మైనవన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కంటిచూపును ఎప్పటి కప్పుడు సరిగా కాపాడుకోగలిగితేనే మన దైనందిన కార్యక్రమాలను సరిగ్గా చేసుకోగలమని తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా కంటి పరీక్షలు (స్క్రీనింగ్, డిస్టెన్స్ విజిబిలిటీ టెస్ట్) చేయించుకున్నారు. ఈ
కార్యక్రమంలో పాల్వంచ సీఐ సతీష్, ఎస్సైలు సుమన్, భిక్షం, రాఘవ, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

Divitimedia

పాడి పశువుల కొనుగోళ్లు నిబంధనల మేరకు నిర్వహించాలి

Divitimedia

ఎన్నికల ప్రక్రియపై సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీఓ

Divitimedia

Leave a Comment