మాజీ ఎంపీ, ఆయన కొడుకుకు పోలీసుల నోటీసులు
✍️ అమలాపురం – దివిటీ (మార్చి 31)
ప్రభుత్వంపై ఆరోపణల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేసినందుకు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్, ఆయన కొడుకుకు ఏపీ పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణం పట్ల అనుమానాలు, ఆరోపణలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, అందుకు సమాధానం చెప్పాలని కోరారు. వీళ్లే కాకుండా ఇంకా పలువురికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Save or share this story as a newspaper-style Epaper Clip:

