Divitimedia
Bhadradri KothagudemBusinessHyderabadLife StylePoliticsSpot NewsTechnologyTelanganaYouth

ITC PSPD లో INTUC క్యాలెండర్ ఆవిష్కరణ

ITC PSPD లో INTUC క్యాలెండర్ ఆవిష్కరణ

✍️ సారపాక – దివిటీ (మార్చి 11)

బూర్గంపాడు మండలం సారపాకలోని ITC-PSPD పేపర్ కర్మాగారంలో INTUC నూతన క్యాలెండర్-2025ను యూనిట్ హెడ్ శైలేందర్ సింగ్ చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో INTUC రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడారు. గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కార్మికసోదరులందరూ భద్రత పాటిస్తూ, కంపెనీ ముందుకు సాగాలని కోరారు. ఈ సంవత్సరం కంపెనీ మరింత అభివృద్ధి చెంది 8వ ప్లాంట్ ఇక్కడే భద్రాచలంలో త్వరగా ప్రారంభించే విధంగా యూనిట్ హెడ్ శైలేందర్ కార్పొరేట్ స్థాయిలో చర్చించాలని కోరుకుంటున్నామన్నారు. అదేవిధంగా జరగబోయే 14వ వేతన ఒప్పందం కూడా కార్మికులందరికీ ఆమోద యోగ్యంగా ఉండేవిధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ హెచ్ఆర్ హెడ్ శ్యామ్ కిరణ్, INTUC అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డి, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, INTUC కార్మిక నాయకులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సత్తుపల్లిలో తెలంగాణ, ఏపీ సరిహద్దు జిల్లాల ఉన్నతాధికారుల సమావేశం

Divitimedia

అమ్మ మాట – అంగన్వాడీ బాట ర్యాలీలు

Divitimedia

నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి : కలెక్టర్

Divitimedia

Leave a Comment