Divitimedia
Bhadradri KothagudemCrime NewsEducationLife StyleSpot NewsTelanganaYouth

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ పాటుపడాలి

చిన్నపిల్లలతో వెట్టిచాకిరీ చేయించే వారిపై క్రిమినల్ కేసులు

బాలకార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కు సమాచారం అందించండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జనవరి 2)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆపరేషన్ స్మైల్-XI కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక, విద్యా, వైద్య,ఆరోగ్యశాఖలు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, తదితర విభాగాల అధికారులతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గురువారం సమావేశం నిర్వహించారు. ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం చేపట్టిన చర్యలను ఎస్పీ వివరించారు. జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, ఇల్లందు, మణుగూరు సబ్ డివిజన్లలో 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, బాల కార్మికవ్యవస్థ నిర్మూలన కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆపరేషన్ స్మైల్ – XI అమలుపై సంబందిత శాఖల అధికారులతో సమీక్షించారు. సమావేశం సందర్భంగా సంబంధిత అధికారులతో కలిసి ఆపరేషన్ స్మైల్-XI పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. సమన్వయంతో పని చేసి ఆపరేషన్ స్మైల్ – Xl కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 18 సంవత్సరాలలోపు తప్పిపోయిన, కిరాణాషాపులలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో, ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న బాలకార్మికులు, వదిలివేయబడిన పిల్లలు, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. వారికి అప్పగించడం గానీ చైల్డ్ కేర్ హోమ్ కు గానీ పంపిస్తున్నట్లు వెల్లడించారు. చిన్న పిల్లలతో బలవంతంగా బిక్షాటన, వెట్టి చాకిరీ చేయించినవారిపై నూతనచట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. బాలల హక్కుల సంరక్షణ ద్వారానే సంపూర్ణ మానవాభివృద్ది సాధ్యమవుతుందని, ఆ దిశగా అధికారులు సమన్వయంతో పక్కా ప్రణాళికతో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే 1098 గానీ, డయల్ 100కు గానీ, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చిన్నపిల్లలు వెట్టి చాకిరీకి గురికాకుండా, చిరునవ్వులు చిందించేలా ప్రతిఒక్కరూ తమ కర్తవ్యం భాద్యతగా నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. సమీక్షలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆపరేషన్ స్మైల్ పోలీస్ నోడల్ ఆఫీసర్, డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామిగౌడ్, డీఎంహెచ్ఓ భాస్కర్ నాయక్, డీడబ్ల్యుఓ స్వర్ణలత లెనినా, సీడబ్ల్యూసీ సభ్యులు అంబేద్కర్, సాదిక్ పాషా, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ షర్ఫుద్దీన్, నాగరాజు, యేసుపాదం, శాస్త్రి, డీసీపీఓ హరికుమారి, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ సందీప్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ నాగరాజురెడ్డి, ఎస్సైలు రమాదేవి, రాకేష్, తిరుపతి, నాగభిక్షం, రామకృష్ణ, సూర్యం, డివిజన్ లోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, ఆపరేషన్ స్మైల్-XI టీం సభ్యులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

‘నేషనల్ స్పోర్ట్స్ డే’ సందర్భంగా ‘చలో మైదాన్”

Divitimedia

ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి

Divitimedia

వరదబాధితులను కాపాడేందుకు అగ్రికల్చర్ డ్రోన్లు ఉపయోగించండి

Divitimedia

Leave a Comment