Divitimedia
EntertainmentHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTelanganaTravel And Tourism

హుస్సేన్ సాగర్ లో ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు

హుస్సేన్ సాగర్ లో ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు

✍️ హైదరాబాద్ – దివిటీ (డిసెంబరు 8)

హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ గగనతలంలో ఆదివారం సాయంత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ప్రదర్శించిన విన్యాసాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజలు వీక్షించారు. తెలంగాణ ప్రజాపాలన – ప్రజావిజయోత్సవాల్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీమ్ అద్భుతమైన విన్యాసాలు ప్రదర్శించింది.
తొమ్మిది జెట్ విమానాలతో నిర్వహించిన విన్యాసాలు నగర ప్రజలను అలరించాయి. ట్యాంక్‌బండ్ వేదికగా ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు విన్యాసాలు వీక్షించగా, ట్యాంక్‌బండ్‌తో పాటు నెక్లెస్ రోడ్డు మార్గం, పరిసర ప్రాంతాల నుంచి ప్రజానీకం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణ ప్రధాన ముఖద్వారం వద్ద తెలంగాణతల్లి విగ్రహ ప్రతిష్టాపనకు జరుగుతున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, తదితరులు పరిశీలించారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్, సాంస్కృతిక వేదికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. వేదికలపై ప్రదర్శనలిచ్చిన కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమాలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి.శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, మహమ్మద్ అలీషబ్బీర్, వేం నరేందర్ రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు హాజరయ్యారు.

Related posts

స్కూల్ గేమ్స్ జాతీయ క్రీడాకారులను అభినందించిన జిల్లా కలెక్టర్ ప్రియాంకఅల

Divitimedia

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బరిలో నిలిచిన 253 నామినేషన్లు

Divitimedia

బ్రిలియంట్ లో అబ్బురపరిచిన బతుకమ్మ సంబరాలు

Divitimedia

Leave a Comment