Divitimedia
Bhadradri KothagudemEducationJayashankar BhupalpallyKhammamLife StyleMahabubabadMuluguNalgondaPoliticsSpot NewsSuryapetTechnologyTelanganaWarangalWomenYouth

ఉపాధ్యాయులు ఓటుహక్కు నమోదు చేసుకోవాలి

ఉపాధ్యాయులు ఓటుహక్కు నమోదు చేసుకోవాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 2)

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకోసం ఉపాధ్యాయులు తమ ఓటుహక్కు నమోదు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలోని  ఉపాధ్యాయులు తమ ఓటు నమోదుకు గడువు తేదీ ( నవంబర్ 6 )సమీపిస్తున్నందున, వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 2018 నవంబర్ ఒకటో తేదీ నుంచి 2024 అక్టోబర్ 31వరకు మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు ఫామ్ -19తో దరఖాస్తు నింపి ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్లో కూడా ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును https://ceotserms2.telangana.gov.in/mlc/form19.aspx వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటుహక్కు కోసం  నమోదుకు జీవో నెంబర్ 49 ద్వారా అర్హులైన పాఠశాల ఉపాధ్యాయుల వివరాలను కలెక్టర్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వంచే గుర్తించబడిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పరిధిలోని

* ఉన్నత పాఠశాలలు

* ప్రత్యేక పాఠశాలలు (వినికిడి లోపం, మెంటల్లీ రిటార్డెడ్, దృష్టి లోపం,ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్, రిఫార్మేటరీ స్కూల్స్, ఓరియంటల్ స్కూల్స్)

* పండిట్ శిక్షణ కళాశాలలు

* అధునాతన సంస్కృత పాఠశాలలు

* జిల్లా విద్య, శిక్షణా సంస్థలు

* ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ స్కూల్స్

* సంగీతం, నృత్య కళాశాలలు

* ఒకేషనల్ జూనియర్ కళాశాలలు

* ఓరియంటల్ ఉన్నత పాఠశాలలు

* అరబిక్ ఉన్నత పాఠశాలలు, కళాశాలలు

* జవహర్ నవోదయ విద్యాలయాలు

* కేంద్రీయ విద్యాలయాలు

* తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ  ద్వారా నిర్వహించబడే రెసిడెన్షియల్ హైస్కూల్స్,  ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ,  తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేట్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ.

* ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్, సీటీఈలు (కళాశాలలు), ఉపాధ్యాయ విద్య.

* సిరామిక్ సంస్థలు, మైనింగ్ సంస్థలు

* సెంట్రల్ క్రాఫ్ట్స్ ఇన్స్టిట్యూట్స్

* విద్యా కళాశాలలు, పాలిటెక్నిక్‌లు

* పారిశ్రామిక శిక్షణా సంస్థలు, కేంద్రాలు (ఐటీఐలు)

* రాష్ట్ర మోడల్ స్కూల్స్

* కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు)

Related posts

బ్రిలియంట్స్ లో అక్టోబరు 1న జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్ష

Divitimedia

ఇసుక అక్రమార్కుల ‘అధికారిక తిరుగుబాటు’…

Divitimedia

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా బక్కి వెంకటయ్య నియామకం

Divitimedia

Leave a Comment