Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsTelanganaYouth

రామవరం హైస్కూల్ సందర్శించిన డీఈఓ

రామవరం హైస్కూల్ సందర్శించిన డీఈఓ

✍️ కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 14)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరాచారి బుధవారం రామవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నాటిన 150 మొక్కలు, వాటి సంరక్షణ తీరును ఆయన పరిశీలించారు. నాటిన అన్ని మొక్కలను కాపాడినందుకు విద్యార్థులను అభినందించారు. జిల్లా కలెక్టర్ సూచించిన మేర మొక్కలను క్రమపద్ధతిలో నాటినందుకు అభినందించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమం “హర్ ఘర్ తిరంగ” లో భాగంగా విద్యార్థులకు జాతీయ జెండాలను అందించారు. జాతీయజెండా ప్రాముఖ్యత గురించి పాఠశాల హెచ్ఎం ప్రభుదయాల్ వివరించారు. దేశభక్తితో, దేశ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ షర్మిలారెడ్డి ఘాటు విమర్శలు

Divitimedia

పుష్ప సినిమా నటుడు జగదీశ్ పై కేసు నమోదు, అరెస్టు

Divitimedia

శ్రమశక్తి అవార్డు అందుకున్న ఐటీసీ కార్మిక నాయకుడు రామారావు

Divitimedia

Leave a Comment