శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్న జనక్ ప్రసాద్
వేతన పెంపు జీఓ, ఈఎస్ఐ ఆసుపత్రి గురించి చర్చించిన ఐఎన్టీయూసీ నాయకులు
✍️ భద్రాచలం – దివిటీ (జులై 27)
తెలంగాణ రాష్ట్ర కనీసవేతనాల సలహామండలి చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా మొట్టమొదటిసారి భద్రాచలం పర్యటనకు శనివారం వచ్చిన జనక్ ప్రసాద్ శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు,అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయనను మర్యాద పూర్వకంగా కలిసినవారిలో ఐ.ఎన్.టి.యు.సి రాష్ట్ర, ఐటీసీ పీఎస్పీడీ నాయకులు మారం వెంకటేశ్వరరెడ్డి, గోనె రామారావు, యారం పిచ్చిరెడ్డి, జిల్లా, భద్రాచలం మండల నాయకులు మహమ్మద్ జిందా, గాడి విజయ్, ఆకుల వెంకట్, పుల్లగిరి నాగేంద్ర, చితీరల హేమంత్, ట్రాక్టర్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు జెసిబి సతీష్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
వేతన పెంపు జీఓ, ఈఎస్ఐ ఆసుపత్రి గురించి చర్చించిన ఐఎన్టీయూసీ నాయకులు
తెలంగాణ రాష్ట్ర కనీసవేతనాల సలహామండలి చైర్మన్ జనక్ ప్రసాద్ శనివారం భద్రాచలం పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆయనను కలిసిన ఐటీసీ ఐఎన్టీయూసీ మిత్రపక్షాల యూనియన్ నాయకులు పలు కార్మికుల సమస్యలపై ఆయనతో చర్చించారు. భద్రాచలంలో దైవదర్శనం అనంతరం జనక్ ప్రసాద్ సారపాకలోని ఐటీసీ కాగితపు పరిశ్రమ ఐఎన్టీయూసీ, మిత్రపక్షాల యూనియన్ ప్రధానకార్యదర్శి యారం పిచ్చిరెడ్డి ఇంట్లో సమావేశమై యూనియన్ కార్యక్రమాలు తదితరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐటీసీ యూనియన్ నాయకులు, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టుకార్మికులకు వేతనాలు పెంచలేదని, ఈ విషయంలో వెంటనే వేతన పెంపు జీఓ విడుదలచేయాలని, సారపాకలో 100పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని కోరారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు మారం వెంకటేశ్వరరెడ్డి, ఐఎన్టీయూసీ ఐటీసీ అధ్యక్షుడు గోనె రామారావు, యూనియన్ కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.