Divitimedia
Bhadradri KothagudemEducationHealthLife StylePoliticsSpot NewsTechnologyTelanganaWomenYouth

ఆహారం తీసుకునే ప్రతిసారి చేతులు శుభ్రపరచుకోవాలి

ఆహారం తీసుకునే ప్రతిసారి చేతులు శుభ్రపరచుకోవాలి

నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో జడ్పీటీసీ మెంబర్ శ్రీలత

ఇరవెండి-2 అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నులిపురుగుల నివారణ దినం

✍️ దివిటీ మీడియా

ఆహారం తీసుకునే ముందు ప్రతిసారి చేతులు శుభ్రపర్చుకోవాలని, అంటువ్యాధులు దరిచేరకుండా చూసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల జడ్పీటీసీ మెంబర్ కామిరెడ్డి శ్రీలత కోరారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మండలంలోని సంజీవరెడ్డిపాలెం గ్రామంలో రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ (గర్ల్స్) కళాశాలలో వైద్య,ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మండల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ, కడుపులో నులిపురుగులు వృద్ధిచెందితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారని, ఆహారం మురికిచేతుల ద్వారా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఆహారం తినే సందర్భాలలో విద్యార్థులు శుభ్రత తప్పకుండా పాటించాలన్నారు. నులిపురుగులు ఉన్న పిల్లల్లో రక్త హీనత పోషకాలలోపం, ఆకలి మందగించడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు , ఒకటి నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలందరూ నులిపురుగుల నివారణ మందులు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. నులిపురుగుల నివారణ మాత్రలతో ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల తహసిల్దార్ ముజాహిద్, ఎంపీడీఓ జమలారెడ్డి, మెడికల్ ఆఫీసర్ లక్ష్మిసాహితి, సీహెచ్ఓలు సీహెచ్.సత్యవతి, సోమ్లానాయక్, హెచ్ఈఓ రవి, హెచ్ఎం కె.తాతారావు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

ఇరవెండి-2 అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నులిపురుగుల నివారణ దినం

బూర్గంపాడు మండలం ఇరవెండిలోని అంగన్వాడీ కేంద్రం-2లో గురువారం జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ డి.మరి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, స్థానిక డ్వాక్రా మహిళలు, గర్భిణలు, బాలింతలు పాల్గొని చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా మేరి మాట్లాడుతూ, నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రల ఉపయోగం గురించి తెలియజేశారు. ఆహారం తీసుకునే ముందు తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాల్సిన అవసరం గురించి మహిళలకు, చిన్నారులకు వివరించి అవగాహన కల్పించారు. అందరికీ పరిశుభ్రంగా పోషకాహారం అందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సంక్రాంతికి ఊరెళ్తున్నారా… అయితే జరభద్రం…!

Divitimedia

విద్యార్థి అమరవీరుల సంస్మరణ సభలు జయప్రదం చేయండి

Divitimedia

ఐసీడీఎస్ లో ‘ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్’ దే పైచేయి

Divitimedia

Leave a Comment