పోలీసులకు పట్టుబడిన వాహనాలకు 27న వేలం
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ మీడియా (జూన్ 14)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో వివిధ కేసులలో సీజ్ చేసిన, యజమానులెవరూ తీసుకెళ్లని(అన్ క్లెయిమ్డ్) గా నిర్దారించబడిన 323 వాహనాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు ఈనెల 27న వేలంపాట నిర్వహించనున్నట్లు ఎంటీఓ ఒ.సుధాకర్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సీజ్ చేసిన వదిలి వేయబడిన వాహనాలను వాటి యజమానులు తిరిగి పొందకపోవడంతో ఆ వాహనాలను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉంచినట్లు తెలిపారు. ఆ వాహనాలలో 306 ద్విచక్రవాహనాలు, 17 ఆటోలు, కార్లు, మొత్తం 323 వాహనాలున్నాయని వెల్లడించారు. పోలీస్ శాఖకు సంబంధించి కాలంచెల్లిన టైర్లు, బ్యాటరీలు, స్పేర్ పార్ట్స్ కూడా ఈనెల 27వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వేలం వేయనున్నట్లు ఎంటీఓ తెలియజేశారు. వేలంపాటలో పాల్గొనడానికి ఆసక్తి కలిగినవారు 8712682145 నెంబర్ కు ఫోన్ చేసి సంప్రదించాలని ఆయన కోరారు.