Divitimedia
Bhadradri KothagudemEducationHealthHyderabadLife StyleTelanganaYouth

పాఠశాలను తనిఖీ చేసిన కేంద్రప్రభుత్వ ప్రతినిధి

పాఠశాలను తనిఖీ చేసిన కేంద్రప్రభుత్వ ప్రతినిధి

✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం

ప్రభుత్వ పాఠశాలల్లో తొలి మెట్టు- ఎఫ్.ఎల్.ఎన్ ప్రాథమిక విద్య అమలు తీరు పరిశీలించేందుకు రామవరంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను నోడల్ అధికారి డాక్టర్ దయాల్, ఢిల్లీకి చెందిన సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్(సి.ఎస్.ఎఫ్) పథక రాష్ట్ర పరిశీలికుడు కార్తీక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులలో సామర్థ్యాలు పరిశీలించి, వాటిని కాస్త మెరుగుపర్చాల్సిన అవసరం గుర్తించారు. తరగతిలో బోధన ప్రణాళిక ప్రకారం నిర్వహించబడాలని, ఫేస్ షీట్ ఆధారంగా విద్యాబోధన విధానాలు విధిగా నిర్వహించాలని, తద్వారా విద్యార్థులలో ఆలోచన సామర్ధ్యాలు పెంపొందించవచ్చని సూచించారు. తరగతిగదిలో ప్రతి విద్యార్థికి సంబంధించిన స్థాయిలను గుర్తించి తగిన రీతుల్లో బోధన విధానాలవలంబించాలని సూచించారు.

Related posts

దేశంలో వరద పరిస్థితులపై అమిత్ షా సమీక్ష

Divitimedia

ఇకనుంచి ప్రతి ఆదివారం గోదావరి నది హారతి

Divitimedia

‘విచారణ ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి…’

Divitimedia

Leave a Comment