Divitimedia
Spot News

అటవీ అమరవీరులకు ఘనంగా నివాళులు

అటవీ అమరవీరులకు ఘనంగా నివాళులు

✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలంలోని సెంట్రల్ పార్కులో సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పలువురు జిల్లా ప్రముఖులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల, అడవుల సంరక్షణ విధులలో గొత్తికోయల చేతిలో హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాస రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడవుల సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబసభ్యులను శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా వినీత్, జిల్లా అటవీ అధికారి కిష్టాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మాదకద్రవ్యాలతో నష్టంపై అవగాహన కల్పించాలి

Divitimedia

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు

Divitimedia

హరిత భద్రాద్రి సాధనకై గ్రీన్ భద్రాద్రి కృషి అభినందనీయం

Divitimedia

Leave a Comment