Divitimedia
Bhadradri KothagudemNalgondaPolitics

బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రమణ ప్రివెంటివ్ అరెస్టు

బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రమణ ప్రివెంటివ్ అరెస్టు

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు

సూర్యాపేట ముట్టడికి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఇచ్చిన పిలుపుతో బూర్గంపాడులో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రమణను పోలీసులు బుధవారం ‘ప్రివెంటివ్ (ముందస్తు) అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రమణ పత్రిక ప్రకటన విడుదల చేశారు. 52శాతం ఉన్న బీసిలకు అరకొర అవకాశాలు కల్పించి, వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తూ వారికి గొర్లు, బర్లు , చేపలు ఇస్తూ, చెరువు కట్ట దగ్గర విందు వినోదాలతో మభ్యపెడుతూ అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయం నిరసిస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఛలో సూర్యపేటకు పిలుపునిస్తే ఓటమి భయంతో రాష్ట్రవ్యాప్తంగా బీఎస్పీ నాయకులను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు, గృహనిర్భంధాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ అక్రమ అరెస్టుల వల్ల ఆత్మగౌరవ ఉద్యమాలను ఆపలేరని , పోలీసు అరెస్టులకు భయపడేది లేదన్నారు.
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్తారన్నారు.

Related posts

జిల్లా పోలీస్ కేంద్రంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

Divitimedia

అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన జిల్లా కలెక్టర్

Divitimedia

Leave a Comment