Divitimedia
EducationHanamakondaTelanganaWarangal

మెగా డీఎస్సీ వేయకపోతే కేసీఆర్ ప్రభుత్వ పాలన భూస్థాపితం చేస్తాం

మెగా డీఎస్సీ వేయకపోతే కేసీఆర్ ప్రభుత్వ పాలన భూస్థాపితం చేస్తాం

పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారావు

కేయూలో పి.డి.ఎస్.యు. ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థుల ర్యాలీ, ఆందోళన

కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో, విద్యార్థి సంఘ నాయకుల అరెస్టు

✍🏽 దివిటీ మీడియా – కేయూ వరంగల్

రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశత్వ, మొండివైఖరి విడనాడాలని, తక్షణం మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, బుధవారం పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో వరంగల్ కాకతీయ యూనివర్సిటీ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు మాట్లాడుతూ, వెంటనే మెగా డీఎస్సీ వేయకపోతే తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వ పాలనను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. యూనివర్సిటీ లోని లైబ్రరీ నుంచి సెకండ్ గేట్ వరకు డీఎస్సీ అభ్యర్థులు భారీ ర్యాలీ నిర్వహించి, గేట్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం ఆరు రోజుల క్రితం 5089 పోస్టులతో వేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దుచేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన 13,089 పోస్టులు, ఉపాధ్యాయుల సర్దుబాటు అనంతరం మిగిలిన 9000 ఉపాధ్యాయ పోస్టులను కలిపి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాల తర్వాత 6లక్షలమంది డీఎస్సీ అభ్యర్థులుండగా, 5వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వేయడం చాలా అన్యాయమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో మళ్లీ అధికారపీఠమెక్కేందుకే ఇంత తక్కువ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ తో విద్యార్థి, నిరుద్యోగ డీఎస్సీ అభ్యర్థులందరినీ బలి చేయాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. తక్షణమే మెగా డీఎస్సీ వేయకుంటే విద్యార్థి నిరుద్యోగులంతా అసెంబ్లీ ముట్టడిస్తామని, అవసరమైతే తెలంగాణలో గ్రామగ్రామానికి తరలి వెళ్లి ప్రజలతో మమేకమై కేసీఆర్ ప్రభుత్వ నిజస్వరూపాన్ని బట్ట బయలు చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ అధికార పతనానికి శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు. హైదరాబాదులో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులను అక్రమంగా అరెస్టు చేసి గోషా మహల్ పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడటం కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశమైన దుర్మార్గ పాలనకు నిదర్శనమని, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాస్తారోకో చేస్తున్న పి.డి.ఎస్.యు రాష్ట్రఉపాధ్యక్షుడు బి నరసింహరావు, కాకతీయ యూనివర్సిటీ నాయకులు రమేష్, నరేష్ లను కేయూ పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు వరంగల్ జిల్లా కార్యదర్శి అలువాల నరేష్, కాకతీయ యూనివర్సిటీ నాయకులు రమేష్, అభిరామ్, కచ్చరు, వేణు, శ్రీనివాస్, అజయ్, సేవియా, గోపాల్, రాకేష్ ,సంగీత, రజియాసుల్తానా, మౌనిక, రవళి, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వైద్యారోగ్య సిబ్బంది పనితీరుపై ఐటీడీఏ పీఓ అసంతృప్తి

Divitimedia

భగవాన్ దాస్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ అన్నప్రసాద వితరణ

Divitimedia

పాలేరులో నామినేషన్ దాఖలు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Divitimedia

Leave a Comment