Divitimedia
Bhadradri KothagudemBusinessLife StyleSpecial ArticlesTelanganaTravel And TourismWELFARE

కృష్ణసాగర్ అడ్డరోడ్డులో ఫారెస్ట్ టోల్ గేట్

త్వరలో ప్రారంభం కానున్న ‘టోల్ ఫీజ్’ వసూళ్లు

✍️ దివిటీ మీడియా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని కృష్ణసాగర్ అడ్డరోడ్డులో తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘టోల్ గేట్’ ద్వారా ‘ఫీజు’ వసూళ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇక్కడ అడ్డరోడ్ఢులో సందెళ్లరామాపురం నర్సరీ వద్ద ఇప్పటికే ‘టోల్ బూత్’ ఏర్పాటు చేశారు. నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు రాగానే ‘టోల్ గేట్’ ఏర్పాటుచేసి టోల్ ఫీజు వసూళ్లు చేయ బోతున్నదని. ఈ ప్రాంతంలో ‘కిన్నెరసాని ఎకో సెన్సెటివ్ జోన్(రిజర్వ్ ఫారెస్ట్)’లో నుంచి వాహనాలు వెళ్తున్నందున ఫీజు (ఎన్విరాన్మెంట్ టోల్) వసూళ్లు చేసేలా ప్రభుత్వం అనుమతించినట్లు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి టోల్ ఫీజు ‘కమర్షియల్ వెహికిల్స్’ నుంచి మాత్రమే వసూలు చేయనున్నారు. కొంత కాలం తర్వాత అన్నిరకాల వాహనాలకు వసూళ్లు విస్తరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల లోపు రూ.100 చొప్పున, సాయంత్రం 6గంటల నుంచి మరసటిరోజు ఉదయం 6గంటల లోపు మాత్రం రూ.200 చొప్పున కమర్షియల్ వెహికిల్స్ నుంచి వసూలు చేయనున్నారు. ఈ టోల్ గేట్ ఏర్పాటుపై ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయనేది వేచి చూడాలి…

Related posts

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు

Divitimedia

పండ్లతోటల్లో పిండినల్లి నివారణకు చర్యలు తీసుకోవాలి

Divitimedia

హైకోర్టు జడ్జిని కలిసిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్

Divitimedia

Leave a Comment