రెండు భారీ పరిశ్రమల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువకులకు 10వ తేదీన ఓరియంటేషన్-సెలెక్షన్
✍️ దివిటీ మీడియా
రెండు భారీ పరిశ్రమల్లో శిక్షణనిచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 10వ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని యువకులకు ‘ఓరియంటేషన్-సెలెక్షన్’ నిర్వహించనున్నట్లు జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
దేశంలోని ప్రముఖ పరిశ్రమలైన Rane (Madras) Limited, MRF Ltd. సంస్థల్లో శిక్షణ, అప్రెంటిస్‌షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు. మొత్తం పోస్టులు 120 (RANE – 50 | MRF – 70) ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు. ఈ ఓరియంటేషన్- సెలెక్షన్ కోసం ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల శనివారం(10వ తేదీ) ఉదయం 10 గంటలకు జిల్లాకలెక్టర్ (IDOC) కార్యాలయంలో హాజరవ్వాలని కోరారు. ఈ రెండు కార్యక్రమాలు Lernern Pvt. Ltd. నిర్వహిస్తుండగా,
యువకులకు పరిశ్రమలో ప్రత్యక్ష అనుభవం, నెలవారీ ఆదాయం, భవిష్యత్ ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధానలక్ష్యంగా అమలు చేయబడుతున్నాయని పేర్కొన్నారు.
👉 Rane (Madras) Limited – Student Trainee (B.Voc / D.Voc Scheme)
పోస్టులు: 50
శిక్షణ స్థలం:
సదాశివపేట ప్లాంట్, సంగారెడ్డి జిల్లా (హైదరాబాద్ సమీపంలో)
అర్హత:
10వ / 12వ / ITI
వయస్సు: 18 – 28 సంవత్సరాలు
పురుషులు మాత్రమే
శిక్షణ కాలం:
2 సంవత్సరాలు
పని గంటలు: రోజుకు 8 గంటలు (షిఫ్ట్ విధానం)
స్టైపెండ్ & లాభాలు:
స్టైపెండ్: ₹13,800
అటెండెన్స్ బోనస్: ₹1,300
మొత్తం ఆదాయం: ₹15,100 / నెల
డిడక్షన్: ₹1,550 (క్యాంటీన్ & వసతి)
చదువుతో పాటు పని (Learn & Earn)
వొకేషనల్ అర్హత (B.Voc / D.Voc)
👉 MRF Ltd. – Apprentice (NAPS Scheme)
పోస్టులు: 70
శిక్షణ స్థలం:
సదాశివపేట, సంగారెడ్డి జిల్లా (హైదరాబాద్ సమీపంలో)
అర్హత:
10వ / 12వ / ITI
వయస్సు: 18 – 28 సంవత్సరాలు
పురుషులు మాత్రమే
శిక్షణ కాలం:
2 సంవత్సరాలు
పని గంటలు: రోజుకు 8 గంటలు (షిఫ్ట్ విధానం)
స్టైపెండ్ & లాభాలు:
స్టైపెండ్: ₹16,500
అటెండెన్స్ బోనస్: ₹1,000
డిడక్షన్: ₹1,850
(క్యాంటీన్, ట్రాన్స్‌పోర్ట్, వసతి & భోజనం)
ప్రభుత్వ అప్రెంటిస్ స్కీమ్ (NAPS) ఎక్కువ నెలవారీ ఆదాయం, సౌకర్యాలు.
దరఖాస్తుకు చివరి తేదీ: 10 జనవరి 2026
సంప్రదించవలసిన నంబర్లు:
9347353551
7995806182

