Divitimedia
Bhadradri KothagudemEducationEntertainmentHyderabadLife StyleSportsSpot NewsTelanganaTravel And TourismYouth

కొత్తగూడెంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ

కొత్తగూడెంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ


✍️ దివిటీ మీడియా

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATG), జిల్లాకలెక్టర్ ఆదేశాల మేరకు సీయం కప్ టోర్నమెంట్ (2వ ఎడిషన్)లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో గురువారం ‘సీయం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుంచి రైల్వేస్టేషన్ వరకు టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ముఖ్య అతిధిగా విచ్చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం తాను అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో యువతీ, యువకులకు 44 అంశాల్లో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ క్రీడాకారులు ఒలింపిక్ స్థాయిలో పతకాలు సాధించాలనే ఉద్దేశంతోనే సీయం కప్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో క్రీడలు, యువజన సర్వీసులశాఖ జిల్లా అధికారి ఎం.పరంధామరెడ్డి, క్రీడాసంఘాల ప్రతినిధులు యుగేందర్ రెడ్డి, మహిధర్, వెంకటేశ్వర్రావు, రమేష్, ఖాసిహుస్సేన్, స్వాతిముత్యం, బాబి, జాన్సన్, శ్రీదర్, మొగిలి, రఘు, కోచ్ లు, డానియల్, కళ్యాణ్, మల్లికార్జున్, నాగేందర్, ఆఫీస్ సిబ్బంది తిరుమల్ రావు, లక్ష్మయ్య, క్రీడాకారులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

జీకేఎఫ్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి దినోత్సవం

Divitimedia

బాలల హక్కులు, సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

Divitimedia

Leave a Comment