Divitimedia
Crime NewsEducationLife StyleSpot NewsTelanganaWomen

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

భరోసా సెంటర్ ఎస్సై చల్లా అరుణ

✍️ దివిటీ – కొత్తగూడెం (18 నవంబరు)

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, తమ రక్షణకు ఆ చట్టాలను వినియోగించుకోవాలని జిల్లా భరోసా సెంటర్ ఎస్సై చల్లా అరుణ కోరారు. ఈ మేరకు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం ఐడీఓసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె భరోసా సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలు, పోక్సో చట్టం, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ వినియోగంలో జాగ్రత్తలు, పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ, తదితర అంశాలు వివరించారు. ఈ సందర్భంగా భరోసా బృందానికి చెందిన కో-ఆర్డినేటర్ రేణుక, లీగల్ సపోర్ట్ పర్సన్ శిరీష, సభ్యులు అంబికా, రమాదేవి, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ సంధ్యారాణి, రిసెప్షనిస్ట్ అనూష తమ తమ బాధ్యతలు, అందిస్తున్న సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య అధికారి డా.ప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి అనూరాధ, మహిళ, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖాధికారులు, సిబ్బంది, సఖి సిబ్బంది, మహిళా సాధికరికత కేంద్రం సిబ్బంది, ఆశావర్కర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Related posts

కార్యకర్తలకు వెన్నంటే ఉంటా : వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్

Divitimedia

ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం : కలెక్టర్

Divitimedia

ఇంతకీ ఇసుక అక్రమ రవాణా ఆపేదెవరు…?

Divitimedia

Leave a Comment