Divitimedia
Bhadradri KothagudemHealthHyderabadKhammamLife StylePoliticsSpot NewsTelangana

పినపాక నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

పినపాక నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఏప్రిల్ 11)

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా స్మరించుకుని, సమాజానికి చేసిన సేవలు, చదువు ప్రాముఖ్యతను గ్రహించి నేడు తమ ప్రభుత్వం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే పాటు పడుతోందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా బూర్గంపాడు మండలంలో ఆర్.అండ్.బి రోడ్డు నుంచి జడ్పీ రోడ్డు వరకు గౌతమ్ పూర్ నుండి సోంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు రూ.90లక్షల వ్యయంతో సీఆర్ఆర్ ప్లాన్ నిధులనుంచి నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి శంకుస్థాపన చేశారు. సారపాకలోని ముత్యాలమ్మతల్లి దేవస్థానంలో జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అశ్వాపురం, మణుగూరు మండలాల్లో పలు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. మణుగూరు మండలం సమితి సింగారంలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో రూ.4.3కోట్ల వ్యయంతో చేపట్టనున్న అదనపు తరగతిగదుల నిర్మాణపనులు ప్రారంభించారు. రూ.1.56కోట్ల ఖర్చుతో పినపాకలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి మారుమూల ప్రాంత ఆదివాసీ గిరిజన గ్రామాల్లో నిరు పేదకుటుంబాలకు విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపు తున్నారన్నారు. యువతీ యువకులు, మహిళలు, సన్నకారు రైతుల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. విద్యపట్ల శ్రద్ధ చూపి ప్రతి నియోజకవర్గంలో 3500 మంది పిల్లలు చదువుకునే విధంగా రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం చేపడుతున్నారని, ఇందుకోసం రాష్ట్రం మొత్తం రూ.11600 కోట్లు మంజూరు చేశారన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో పనిచేసే వైద్య సిబ్బంది వారి విధులు సక్రమంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. మణుగూరు మండలం బొజ్జవారిగుంపు ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ వంక శివలక్ష్మి ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేశారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్, పలువురు జిల్లా అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

‘డీడబ్ల్యుఓ’గా మరోసారి స్వర్ణలతలెనినాకు బాధ్యతలు

Divitimedia

రెవెన్యూమంత్రి పేరుతో వ‌సూళ్లు

Divitimedia

ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన ప్రత్యేకాధికారి

Divitimedia

Leave a Comment