Divitimedia
Bhadradri KothagudemKhammamLife StyleSpot NewsTelangana

జిల్లా సమగ్రాభివృద్ధిలో టీఎన్జీఓలు భాగస్వామ్యం కావాలి

జిల్లా సమగ్రాభివృద్ధిలో టీఎన్జీఓలు భాగస్వామ్యం కావాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 5)

జిల్లా అభివృద్ధి ప్రజల ఆకాంక్ష అయితే.. సమగ్రాభివృద్ధి బాధ్యత టీఎన్జీఓలదని ఆ సంఘం నాయకులతో జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సంఘం నూతన డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నేటి మారుతున్న పరిస్థితులకనుగుణంగా, భవిష్యత్‌ అవసరాలు దృష్టిలో ఉంచుకుని జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలను, గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి పరుచుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించార. జిల్లా సమ్మిళితాభివృద్ధిని కొనసాగించేలా విస్తృత పరిధిలో ఒక సమీకృత విధానం రూపొందించుకోవాలని, జిల్లా అభ్యున్నతికి సలహాలు సూచనలు ఇవ్వాలని టీఎన్జీఓస్ నాయకులను కోరారు. ప్రధానంగా రైతులకు సాంకేతికతను అవలంబించడంపై మెరుగైన అవగాహన కల్పించడానికి విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించాలని, వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రవేశ పెట్టడానికి, విస్తరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ అన్నారు. టీఎన్జీఓ సంఘం తరఫున వ్యవసాయ రంగం బలోపేతం కోసం అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో TNGO జిల్లా అధ్యక్షుడు అమరనేని రామారావు, కార్యదర్శి సాయిభార్గవ్ చైతన్య, జిల్లా కార్యవర్గం పాల్గొన్నారు.

Related posts

విద్యార్థి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి : పి.డి.ఎస్.యు

Divitimedia

క్రీడాపాఠశాలలో ప్రవేశాలకు 21 నుంచి మండలస్థాయి ఎంపికలు

Divitimedia

పరిశ్రమల ప్రతినిధులతో ఓటుహక్కుపై కలెక్టర్ సమావేశం

Divitimedia

Leave a Comment