ఇంటర్మీడియట్ పరీక్షకేంద్రం పరిశీలించిన ఎస్పీ


✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ(మార్చి 5)
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన సందర్బంగా లక్ష్మీదేవిపల్లిలోని నలంద జూనియర్ కళాశాల పరీక్షకేంద్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం సందర్శించారు. అక్కడ విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్సైలు నరేష్, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.