Divitimedia
BusinessDELHIHyderabadNational NewsPoliticsSpot NewsTechnologyTelangana

బకాయిలు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరిన సీఎం

బకాయిలు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరిన సీఎం

కేంద్రమంత్రితో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ

✍️ హైదరాబాద్, న్యూఢిల్లీ – దివిటీ (మార్చి 4)

కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల బకాయిలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రితో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు రూ.1,468.94కోట్లు విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద రాష్ట్రం సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి బకాయిలు రూ.343.27 కోట్లు విడుదల చేయాలని, కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ గడువును పొడిగించాలని కూడా వారు కోరారు.

Related posts

సహాయక చర్యల్లో అలసత్వంపై సీఎం ఆగ్రహం

Divitimedia

మా పెద్దలకు మేమే చదువు నేర్పిస్తాం…

Divitimedia

సీయం ఓవర్సీస్ స్కాలర్ షిప్ దరఖాస్తుకు సెప్టెంబర్ 21 చివరి గడువు

Divitimedia

Leave a Comment