ట్రైకార్ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సదాభార్గవి
✍️ విజయవాడ – దివిటీ (డిసెంబరు 23)
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థికసంస్థ (ట్రైకార్) మేనేజింగ్ డైరెక్టర్ గా గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ సదా భార్గవి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్న సదాభార్గవికి రాష్ట్ర ప్రభుత్వం ట్రైకార్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించింది. ఈ మేరకు ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమశాఖ జీఓ నెం. 171 జారీచేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సదాభార్గవి విజయవాడ ట్రైకార్ ప్రధానకార్యాలయంలో ఎండీ (మేనేజింగ్ డైరెక్టర్)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు ట్రైకార్ ఉన్నత అధికారులు, కార్యాలయ ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.