క్యాలెండర్ ఆవిష్కరించిన గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్
✍️ అమరావతి – దివిటీ (డిసెంబరు 20)
విద్య, గౌరవం, అధికారం, అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన 2025 “ట్రైబల్ విజన్” క్యాలెండర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ సదాభార్గవి శుక్రవారం ఆవిష్కరించారు. క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ను ఆమె కార్యాలయంలో అతిథులు ఙ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య ఆతిధులుగా జాతీయ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు మాదిగాని గురునాథం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ ఉమ్మడి కమిషన్ మాజీసభ్యులు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్, గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరం సత్యం, గిరిజన నాయకులు దేవరకొండ కృష్ణ, దాసరి అమరసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.