అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ సందర్శించిన కలెక్టర్
✍️ కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 7)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతకొత్తగూడెంలోని మండల రిసోర్స్ కేంద్రం ఆవరణలో నిర్వహించబడుతున్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ శనివారం సందర్శించారు. గతంలోనే ఈ స్కూల్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ మేరకు శనివారం సోలార్ హీటర్లను ప్రారంభించి, వాటి పనితీరు కూడా పరిశీలించారు. తరగతి గదిలో బోధనను పరిశీలించి, విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. పాఠశాల పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబర్చాలని నిర్వాహకులను కోరారు. కలెక్టర్ వెంట మండల విద్యాశాఖ అధికారి డా.ప్రభు దయాల్, జిల్లా అకడమిక్ కోఆర్డినేటర్ నాగరాజశేఖర్, పాల్గొన్నారు.