Divitimedia
Bhadradri KothagudemLife StyleSpot NewsTelanganaWomen

మహిళాశక్తి భవనాలకు స్థలం పరిశీలించిన జిల్లా కలెక్టర్

మహిళాశక్తి భవనాలకు స్థలం పరిశీలించిన జిల్లా కలెక్టర్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 7)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో మహిళాశక్తి భవన సముదాయాల నిర్మాణం కోసం లక్ష్మీదేవిపల్లిలోని ఇల్లందు క్రాస్ రోడ్ లో కేటాయించిన స్థలాన్ని శనివారం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ శ్రీనివాసరావును అడిగి అక్కడ చేపట్టబోయే నూతన భవననిర్మాణ అంచనాలను గురించి వివరాలు తెలుసుకున్నారు. మహిళాశక్తి భవనాలు రూ.5కోట్లతో నిర్మించేందుకు అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. అత్యంత విశాలమైన భవనం నిర్మించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మహిళాశక్తి భవనాలు అందుబాటులోకి వస్తే స్వయం సహాయక సంఘాలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ శివలాల్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏజెన్సీలో గిరిజనేతరులకు గృహలక్ష్మి వర్తింప చేయాలి

Divitimedia

రక్షణశాఖ భూముల కోసం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ వినతి

Divitimedia

“గ్రీవెన్స్ డే”లో బాధితులకు ఎస్పీ భరోసా

Divitimedia

Leave a Comment