అవినీతి వ్యతిరేక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 3)
అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం (డిసెంబరు 9వ తేదీ) సందర్భంగా శనివారం నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోతున్న అవినీతి వ్యతిరేక వారోత్సవాల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మంగళవారం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ ఆవిష్కరించారు. జిల్లాకలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ వై.రమేష్, ఇన్స్పెక్టర్ ఎన్.శేఖర్, ఆ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.