ఉత్సాహంగా 2కె రన్, పాల్గొన్న కలెక్టర్
✍️ కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 1)
రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంబరాల సందర్భంగా మొదటి రోజు ఆదివారం కొత్తగూడెంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి రామచంద్ర డిగ్రీకాలేజి వరకు సాగిన ఈ రన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ లో కలెక్టర్, వివిధ శాఖల అధికారులు, నాయకులు, విద్యార్థులు, వాకర్స్, యువకులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు..ఈ సందర్భంగా కలెక్టర్ జి.వి.పాటిల్ మాట్లాడుతూ, ఆటలను బహుమతుల కోసమనే కాక ఇష్టంతో ఆడుకుంటామన్నారు. ఆరోగ్యంపై అందరికీ అవగాహన కల్పించేందుకే ఈ రన్ నిర్వహించామని పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల ప్రతిఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని, శ్రద్ధ వహించాలని, ఉదయం నడక, రన్నింగ్ లాంటివి అవసరమన్నారు. క్రీడల అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ పరంధామరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, నాగ సీతారాములు, పలు క్రీడాసంఘాల సభ్యులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.