Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsTechnologyTelanganaYouth

మా పెద్దలకు మేమే చదువు నేర్పిస్తాం…

మా పెద్దలకు మేమే చదువు నేర్పిస్తాం…

రామవరంలో హెచ్ఎం వినూత్న విద్యాపథకం

✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 19)

రోజంతా బడిలో విద్యార్థులు… ఆ తర్వాత ఇళ్లకు వెళ్లగానే వారే గురువులు… అదేంటని ఆశ్ఛర్యపోతున్నారా?… ఇది నిజంగా నిజమేనండీ… ఓ ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుడు చేసిన వినూత్న
ఆలోచన ఈ సరికొత్త విద్యాపథకానికి పూర్వ వైభవం తీసుకొస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మండల పరిధిలోని రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం ప్రభుదయాల్ ఓ వినూత్న విద్యా పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఆ పాఠశాల విద్యార్థుల్లో నిరక్షరాసులైన తల్లిదండ్రులను గుర్తించి, వారి పిల్లల ద్వారానే పెద్దలకు చదువు నేర్పించేలా ఈ పథకం రూపొందించారాయన. అందుకు అవసరమైన పలకలు, బలపాలు అందించి, రోజూ కొంత సమయం తమ తల్లిదండ్రులకు చదువు నేర్పించేందుకు కేటాయించాలని విద్యార్థులకు సూచించారు. కనీసం రాయడం, చదవడం నేర్పాలని కోరారు. ఉత్సాహంతో పలకలు బలపాలు తీసుకున్న ఆ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులకు చదువు నేర్పిస్తామంటూ ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈ పథకం వల్ల నిరక్షరాస్యులైన వయోజనులకు విద్యాగంధం సోకనుంది.

Related posts

ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా శ్రీనివాసరెడ్డి నియామకం

Divitimedia

పర్యావరణ ఆడిటింగ్ థర్డ్ పార్టీ బృందం తనిఖీ

Divitimedia

సీసీఐ కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్

Divitimedia

Leave a Comment