నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు
✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 17)
జిల్లాలో జరుగుతున్న కులగణన సర్వే, గ్రూప్3 పరీక్షల కారణంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులందరూ గ్రూప్-3 పరీక్షలు, సర్వే విధుల్లో నిమగ్నమై ఉన్నందు ప్రజావాణి కార్యక్రమానికిహాజరు కాలేరని, అందుకే 18వ తేదీన జరగవలసిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వినతులు, ఫిర్యాదులిచ్చేందుకు ప్రజలెవరూ కలెక్టరేట్ కు రావద్దని సూచించారు.