Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsTelanganaYouth

గ్రంధాలయాలు ప్రత్యక్ష దేవాలయాలు

✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 14)

ప్రత్యక్ష దేవాలయాలైన గ్రంధాలయాలపై ఆధారపడి చదువు సాగించిన వారి జీవితాలు సుంధరమయంగా ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభిప్రాయపడ్డారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గురువారం జడ్పీ సమావేశ మందిరంలో జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కలెక్టర్, స్థానికసంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి మాత, గ్రంథాలయాల పితామహుడు ఎస్.ఆర్ రంగరాజన్, చాచా నెహ్రూ చిత్రపటాలకు పూలమాలలు అలంకరించారు. వివిధ పాఠశాలలనుంచి హాజరైన విద్యార్థులనుద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వుస్తకాల విలువ గుర్తించాలని సూచించారు. వుస్తక వఠనం ద్వారా జీవన విధానం, బ్రతుకు చిత్రం మారుతుందని, చదువు ఒక్కటే మనిషి మనుగడలో మార్పు తెస్తుందన్నారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన చిన్నారుల నృత్యప్రదర్శనను చూసిన కలెక్టర్ వారిని అభినందిస్తూ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. కొత్త గ్రంథాలయ భవనాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని, అన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కమీషనర్ శేషాంజనస్వామి, గ్రంథాలయ ఆఫీస్ ఇంచార్జ్ ఎం నవీన్ కుమార్, గ్రంథ పాలకురాలు జి మణిమృదుల, జిల్లాలోని గ్రంథపాలకులు మధు బాబు, వంశీ, జానీ, వాణి, రుక్మిణి, గీత, తదితరులు కూడా పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

క్రికెట్ అభిమానులకు ప్రపంచకప్ ‘కనులవిందు’

Divitimedia

ఆదివాసీ గ్రామంలో సౌకర్యాలు కల్పించాలి : రమణ

Divitimedia

మహిళల రక్షణే షీటీమ్స్ ప్రధాన లక్ష్యం : ఎస్పీ డా.వినీత్

Divitimedia

Leave a Comment