Divitimedia
Bhadradri KothagudemCrime NewsHealthHyderabadLife StyleSpot NewsTechnologyTelangana

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

✍️ హైదరాబాదు, భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 13)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి బుధవారం హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రూప్-3 పరీక్షల నిర్వహణ, ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, నర్సింగ్, పారామెడికల్ కాలేజ్, తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్సులో ఆమె దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాత ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ జి.వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, తదితరులతో కలిసి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో స్థానికసంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, సీపీఓ సంజీవరావు, జిల్లావ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పౌరసరఫరాల శాఖ అధికారులు రుక్మిణి, త్రినాధ్ బాబు, సంబధిత అధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బ్రిలియంట్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

Divitimedia

జీకేఎఫ్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి దినోత్సవం

Divitimedia

స్కూటీపై తరలిస్తున్న గంజాయి పట్టివేత

Divitimedia

Leave a Comment